Tuesday, December 24, 2024

‘మహారాజ’ మౌళి: శంకర్

- Advertisement -
- Advertisement -

Rajamouli is famous director

మీ ఊహా శక్తి అతీతమైనది ‘మహారాజ’ మౌళి అంటూ దర్శక ధీరుడు రాజమౌళిని ఉద్దేశించి స్టార్ డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు శంకర్ తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై ప్రశంసలు కురిపించారు. “ఆర్‌ఆర్‌ఆర్‌కి ఒక కొత్త అర్ధాన్ని వివరిస్తూ.. మాకు ఓ గొప్ప అనుభూతిని ఇచ్చినందుకు చిత్ర యూనిట్ అందరికీ చాలా థాంక్స్. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటన అద్భుతం. మీ ఊహా శక్తి అతీతమైనది హ్యాట్సాఫ్ ‘మహారాజ’ మౌళి” అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News