Wednesday, January 22, 2025

పాన్ వరల్డ్ లెవెల్లో నెక్ట్స్ ప్రాజెక్ట్..

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం మన ఇండియా సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ మూవీ ఏదన్నా ఉందంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా. ఈ చిత్రం పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుంది. అయితే ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సక్సెస్‌తో వరల్డ్‌వైడ్ రాజమౌళి పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయింది.

దీంతో తన నెక్స్ ప్రాజెక్ట్ అయినటువంటి మహేష్‌తో చేయనున్న సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అలాగే రాజమౌళి గత కొన్ని రోజులుగా హాలీవుడ్ దిగ్గజ దర్శకులని కలుస్తుండడంతో మహేష్ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం పాన్ వరల్డ్ లెవెల్లో ఏ రేంజ్‌లో తెరకెక్కుతుందో చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News