Friday, December 20, 2024

`అధీర` ఫస్ట్ స్ట్రైక్ విడుదల

- Advertisement -
- Advertisement -

Rajamouli, NTR, Ram Charan Launched First Strike Of Adhira

క్రియేటివ్ దర్శకుడి గా పేరుపొందిన ప్రశాంత్ వర్మ తను చేసే సినిమాల తో హీరోలను సూపర్ హీరోలను చేస్తున్నాడు. టాలీవుడ్ కి జాంబి కాన్సెప్ట్ని పరిచయం చేసిన తర్వాత, ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో సినిమా `హను-మాన్`ని రూపొందిస్తున్నారు. ఇందులో తేజ సజ్జ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. కాగా, మరో హీరోని పరిచయం చేస్తూ మరో సూపర్ హీరో ఫిలిం చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ.  ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు.  ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి `అధీర` అనే టైటిల్ నిర్ణయించారు.

భారతీయ పౌరాణిక పాత్రల నుండి ప్రేరణ పొందిన ప్రశాంత్ వర్మ, మార్వెల్, డిసి వంటి సూపర్ హీరోలను క్రియేట్ చేస్తున్నాడు.  సినిమాటిక్ యూనివర్స్ నుండి ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్, కథను చెప్పే విధానం ప్రత్యేకంగా వుండబోతోంది.  కళ్యాణ్ టైటిల్ రోల్లో కనిపించనున్న ఈ సూపర్ హీరో చిత్రం అధీర ఎంతో ప్రత్యేకతను సంతరించుకోనుంది. గ్రాండ్ గా ఉండేలా డిజైన్ చేసిన `అధీర` పోస్టర్ను ఆర్.ఆర్.ఆర్. త్రయం అయిన ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా విడుదల చేసి అధీర టీం కి తమ బెస్ట్ విషెస్ తెలియజేసారు. దాంతో అధీర నుంచి వచ్చిన ఫస్ట్ స్ట్రైక్  ప్రారంభంలోనే భారీ స్థాయిలో క్రేజ్ను సంపాదించుకుంది.

ఫస్ట్ స్ట్రైక్ చూస్తుంటే,  చిన్నప్పటి నుంచీ అధీరకు పవర్స్ వున్నాయనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ సన్నివేశాలతో ఆకట్టుకుంది. విజువల్స్ గ్రాండియర్గా వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ సంగీతం మరోస్థాయిలో వుంది. వీటిని చూస్తే ప్రశాంత్ వర్మ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాడని స్పష్టమవుతోంది. విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో ఎనర్జీ లెవెల్ పెంచేలా వీడియోలో అధీరగా కళ్యాణ్ కనిపించాడు. తన చేతిలో వున్న ఆయుధం వెన్నెముక ఆకారంలో ఉండి,  ఇంద్రుడి శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధం ను పోలివుంది.

‘అధీర ఫస్ట్ స్ట్రైక్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా వుండబోతున్నాయి. ‘అధీర ఫస్ట్ స్ట్రైక్’  ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచుతుంది. కళ్యాణ్ దాసరి ఫేస్ పాక్షికంగా రివీల్ చేయబడింది.  అందమైన లుక్ తో, తగినంత ఎత్తుతో పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీమతి చైతన్య సమర్పణ లో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. విజువల్స్, బిజి.ఎం. పర్ఫెక్ట్ సింక్లో వున్న సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హను-మాన్కి సంబంధించిన అన్ని పనులను ప్రశాంత్ వర్మ పూర్తి చేసిన తర్వాత ` అధీర `కు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News