- Advertisement -
ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీఓ జారీచేసిన నేపథ్యంలో ఏపీ సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా దర్శకధీరుడు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి స్పందిస్తూ ట్వీట్ చేశారు.
“ఏపీ సిఎంకు ధన్యవాదాలు.. వైయస్ జగన్, పేర్నినాని కొత్త జీఓలో సవరించిన టికెట్ ధరల ద్వారా చలన చిత్ర రంగానికి ఎంతగానో సహాయపడ్డారు. ఇది సినిమాల పునరుద్ధరణకు దోహదపడుతుందని ఆశిస్తున్నాను”.. అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.
- Advertisement -