Monday, December 23, 2024

‘కల్కి 2898 ఏడీ’లో రాజమౌళి?

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ’కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి భాగం కానున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే రాజమౌళి ఈ సినిమా దర్శకత్వ శాఖకు కొన్ని సలహాలు ఇచ్చినట్టుగా తెలిసింది. కాగా ఈ ‘కల్కి 2898 ఏడీ’ టీజర్ వచ్చినప్పుడు దాని గురించి రాజమౌళి సోషల్ మీడియాలో గొప్పగా మాట్లాడాడు. ఇక ఈ సినిమాలో రాజమౌళి ఒక అతిధి పాత్రలో కనపడనున్నాడని కూడా అంటున్నారు.

ఈ సినిమాలో ఇప్పటికే చాలామంది నటులు వున్నారు. దీన్ని ఒక పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నాడు ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్. ఇందులో ప్రభాస్ ఒక ఐరన్‌మేన్‌లాంటి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా వున్నాడని వార్తలు వచ్చినప్పుడు, ఆ విషయాన్ని ఫిల్మ్‌మేకర్స్ చెబితే బాగుంటుంది అని అయన చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News