Thursday, January 23, 2025

టీషాపు నడుపుతున్న తలైవా: అభిమానులు షాక్(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. అయితే అలా ఒకరిద్దరు కనిపించిన ఘటనలు కూడా అక్కడక్కడా వింటుంటాం. తాజాగా..సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని అచ్చుగుద్దినట్లు పోలిన ఒక వ్యక్తి వీడియో ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది.

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి రజనీలా కనిపించడమే కాదు ఆయన మేనరిజాలు కూడా పుణికిపుచ్చుకోవడం విశేషం. కేరళలోని ఫోర్ట్ కోచ్చిలో రోడ్డు పక్కన టీ అంగడి పెట్టుకున్న ఈ వ్యక్తి పేరు సుధాకర్ ప్రభు.

రజనీకాంత్‌లాగే నెరిసిన జుట్టు, గడ్డంతో షార్ట్, టీషర్ట్ వేసుకుని నిరాడంబరంగా, స్టయిలిష్‌గా కనిపిస్తున్న సుధాకర్ ప్రభు వీడియోను ఇటీవల డిస్పోర్టర్ అనే పేరు గల ఎక్స్ హ్మాండిలర్ షేర్ చేశాడు. అయితే మలయాళ నటుడు, దర్శకుడు నాదిర్‌షా ఇటీవల తన చిత్రం షూటింగ్ నిమిత్తం అక్కడకు వెళ్లినపుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌లా కనిపించిన టీ దుకాణదారుడు సుధాకర్ ప్రభును చూసి షాక్ అయ్యారు.

ఆయన తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సుధాకర్ గురించి రాసుకొచ్చారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తయినప్పటికీ రజనీని పోలిసన ఈ వ్యక్తి ఒక టీషాపులో పనిచేస్తున్నారంటూ ఆయన తెలియచేయడంతో రాత్రికిరాత్రి సుధాకర్ ప్రభు దశ మారిపోయింది.

సుధాకర్ ప్రభు ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఆయన సెలబ్రిటీకి మారిపోయారు. కేరళ వ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. వివిధ వేడుకలు, కార్యక్రమాలకు రావాలంటూ ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి. తమ అభిమాన తలైవర్‌ను పోలిన ఈ వ్యక్తిని చూసేందుకు రజనీ అభిమానులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News