Thursday, January 23, 2025

రజనీకాంత్ కు దుబాయ్ గోల్డెన్ వీసా!

- Advertisement -
- Advertisement -

అబూ ధాబీ: సూపర్ స్టార్ రజనీకాంత్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. తనకు ఈ గౌరవాన్ని అందించిన యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు  తెలిపారు.

వివిధ దేశాల, వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో ఈ ప్రత్యేక వీసాను యూఏఈ అందిస్తుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసా అందిస్తోంది. ఈ రకం వీసాలు అందుకున్న వారిలో షారూఖ్ ఖాన్, సంజయ్ దత్, అల్లు అర్జున్, త్రిష, అమలాపాల్, మోహన్ లాల్, మమ్ముట్టి, టివినో థామస్, దుల్కర్ సల్మాన్, ఉపాసన ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు రజనీకాంత్ కూడా చేరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News