Monday, December 23, 2024

అక్వా హబ్‌కు సిరిసిల్ల జిల్లా వేదిక: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

Rajanna sircilla district is Aqua hub

రాజన్నసిరిసిల్ల: అప్పర్ మానేరు నుంచి మంథని వరకు మానేరు సజీవంగా మారిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో మంత్రి కెటిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 58 వేల ఎకరాలకు పైగా అదనంగా సాగు నీరు అందించామన్నారు. అక్వా హబ్‌కు సిరిసిల్ల జిల్లా వేదిక కాబోతుందని, రూ.150 కోట్లతో 24 చెక్ డ్యామ్‌లో నిర్మిస్తున్నామని, సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు రికార్డు స్థాయిలో పెరిగాయని, సిరిసిల్లలో 3402 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News