Sunday, December 22, 2024

గంభీరావుపేటలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ అడవి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్, ఎస్‌డి చందా అనే యువకులు ఇంటర్వూ కోసం బైక్‌పై వెళ్తుండగా వారిని డిసిఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. గంభీరావు పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News