Thursday, January 23, 2025

రాజన్న ‘సిరిపట్టు’

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన చీరలకు
ఖండాతర ఖ్యాతి న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక
రాధాకృష్ణన్ చేతులమీదుగా ఆవిష్కరణ వినూత్న
ఉత్పత్తులతో ప్రపంచాన్నే ఆకర్షించే స్థితికి సిరిసిల్ల
కార్మికులు ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్
ప్రారంభోత్సవంలో కెటిఆర్ వీడియో సందేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’ అంతర్జాతీయ వేదికలపైన అనేక మందిని ఆకర్షిస్తున్నది. సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు తయారుచేసిన రా జన్న సిరిపట్టు పట్టుచీరలను న్యూజిలాండ్‌కు చెందిన మం త్రి ప్రియాంక రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఆ దేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరిచారు. రాజన్న సిరిపట్టు చీరలను ప్రారంభించిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంకకు రాష్ట్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి కె. తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపైన ఆవిష్కారం కావడం అత్యంత సంతోషా న్ని ఇస్తున్నదన్నారు.న్యూజిలాండ్ లో జరిగిన రాజన్న సిరి పట్టు బ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ వీడి యో సందేశం ద్వారా మాట్లాడారు. న్యూజిలాండ్ మంత్రి తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్‌ఆర్‌ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తదితరులను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు నేడు వినూత్నమైన ఉత్పత్తుల తో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారన్నారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ లాంటి నైపుణ్యం కలిగిన నే తన్నలు, వినూత్న ఉత్పత్తులను తయారు చేయడం పట్ల కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే హరిప్రసాద్ లాంటి నేతన్నల నైపుణ్యం వల్ల సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేయ డం జరుగుతున్నదన్నారు. సిరిసిల్ల రాజన్న సిరి పట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని, అందుకు అవసరమైన అన్ని ర కాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని కెటిఆర్ పేర్కొన్నారు.

నాలుగు సంవత్సరాల క్రితం బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు తెలంగాణకు వచ్చిన బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ సిరిసిల్ల లోని నేతన్నలు, వారి నైపుణ్యం గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు. అప్పుడే సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ గురించి తెలుసుకొని, ఆయనతో పట్టుచీరలు తయారు చేయించారన్నారు. వీటిని అమెరికా, యుకె, న్యూజిలాండ్ వంటి ఆరు దేశాల్లోని తెలిసిన వారికి, సిరిసిల్ల పట్టుచీరలకు ఆర్డర్లు ఇప్పించారన్నారు. అయితే సిరిసిల్ల పట్టుచీరలకు ఒక బ్రాండ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో రాజన్న సిరిపట్టుగా నామకరణం చేసి న్యూజిలాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌తో పాటు 300 మంది ప్రవాస భారతీయుల సమక్షంలో సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులను ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉం దని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తదనంతరం సిరిసిల్ల పట్టుచీరలతో ఒక ఫ్యాషన్ షోను సైతం నిర్వహించారు.

సిరిసిల్ల పట్టు చీరలు బాగున్నాయి

రాజన్న సిరిపట్టును న్యూజిలాండ్ కేంద్రంగా ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని న్యూజిలాం డ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బ్రాండ్ తెలంగాణా ఫౌండర్ సునితా విజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తాను నాలుగేళ్ల క్రితం న్యూజిలాండ్ లో ఉన్న ప్రవాసీ భారతీయులు బతుకమ్మ పండగకు పిలిస్తే సిరిసిల్ల చీరనే కట్టుకొని వచ్చానని అన్నారు. అందరితో కలిసి బతుకమ్మ ఆడానని తెలిపారు. ఈ వార్తలు ఇండియన్ మ్యాగ్జిన్స్‌లో ప్రముఖంగా ప్రచురితం కావడం మరింత సంతోషాన్నిచ్చిందన్నారు. దీని వల్లనే తెలంగాణ మంత్రి కెటిఆర్ తనను హైదరాబాద్‌లో కలిసి అద్భుతంగా ఆహ్వానం పలికారన్నారు. అమితంగా గౌరవించారని ప్రియాంక రాధాకృష్ణన్ పేర్కొన్నారు. యువ మంత్రి కెటిఆర్ నేతృత్వంలో తెలంగాణాలో నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్దఎ్తతున చేయూతనందిస్తూన్నారన్నా రు. పెద్దసంఖ్యలో ఉపాధిని చూపుతున్నారని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇందుకు కెటిఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వా న్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశంలోనే మంచి అభివృద్ధి ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నా రు. ఇటువం టి కార్యక్రమాలు రెండు దేశాల మధ్య స్నేహభావాలు పెంచుతాయన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల ఉత్పత్తులకు తాము కూడా మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా హమీ ఇచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా సిరిసిల్ల ఉత్పత్తులు

సిరిసిల్ల చేనేత ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలన్నదే తన లక్షమని బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తెలిపారు. సిరిసిల్ల నేతన్న కోసం మంత్రి కెటిఆర్ పడుతున్న తపన చూసి తాను కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతో పట్టు చీరలు సిరిసిల్లలో తయారు చేయిస్తున్నానని తెలిపారు. ఇలా తయారు చేయించిన చీరలను దేశ, విదేశాల్లో తమ బ్రాండ్ తెలంగాణ ద్వారా ప్రమోట్ చేస్తున్న ట్లు పేర్కొన్నారు. మొదటగా ఒకరితో ప్రారంభించాలని సిరిసిల్ల లో ప్రతిభ కలిగిన హరిప్రసాద్‌ను ఎన్నుకొని ఈ పట్టుచీరలు తయారు చేయించానని తెలిపారు. ప్రస్తుతం ఆరు దేశాల్లో మార్కెంటింగ్ కల్పించి ఆర్డర్లు ఇప్పించమన్నారు. ఎలాంటి లాభాపేక్షా లేకుండా నేరుగా సిరిసిల్ల నేతన్నలకే ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. చీరల తయారీలో తప్పిదాలు జరిగిన కూడా సలహాలు, సూ చనలు ఇస్తూ పట్టుచీరలు ఆర్డర్లు ఇస్తున్నామన్నారు.

ప్రస్తు తం సిరిసిల్లలో ఈ తయారిలో 40 మంది పాల్గొని ఉపాధి పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్ల అనగానే కేవలం బతుకమ్మ చీరలే కాకుండా మహిళలు ఇష్టంగా కట్టుకునే పట్టు చీరలు కూడా తయారు అవుతాయన్నారు. దీనికి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందని చాటి చెప్పడానికి బాగా ఆలోచించి ‘రాజన్న సిరిపట్టు’ గా నామకరణం చేసి… ప్రారంభించడం చేయడం జరిగిందన్నారు. మంత్రి కెటిఆర్ వీడియో సందేశంతో తమలో మరిం త ఉత్సహాన్ని నింపారన్నారు. తమ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. కులవృత్తుల ఉత్పత్తులకు చేయూతనందించడం, దేశ విదేశాల్లో మార్కెంటింగ్ కల్పించడం జరుగుతుందన్నారు. తమ సంస్థ కార్యక్రమానికి కెటిఆర్ సైతం సహకరించి మద్దతు పలకడం చాలా సంతోకరమన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాండ్ తెలంగాణా కో పౌండర్లు విజయ్ కోస్న, కల్యాణ్ రావ్ కాసుగంటి, ఇనుగంటి నర్సింగ రావ్, పోకల కిరణ్, న్యూజిలాండ్ ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News