Wednesday, January 29, 2025

స్నేహితుడి ప్రాణం తీసిన పాత పగ

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: పాత పగను లోపల ఉంచుకొని స్నేహితుడిని నమ్మించి గొంతు కోసి చంపిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్ల వేములవాడ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వేములవాడ మండలం కేంద్రంలోని ఓల్డ్ అర్బన్ కాలనీలో కురుకుంట్ల శ్రీధర్(24), బాబు స్నేహితులుగా ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇద్దరు మధ్య చిన్న గొడవ జరగడంతో బాబు బైక్‌ను శ్రీధర్ బాబు తగలబెట్టాడు. అప్పటి నుంచి శ్రీధర్‌పై బాబు పగ పెంచుకున్నాడు. అతడితో స్నేహంగా నటిస్తూనే అంతం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం రాత్రి శ్రీధర్‌ను నమ్మించి వేములవాడ శివారులోని బైపాస్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి వరకు ఇద్దరు మద్యం తాగిన అనంతరం శ్రీధర్‌ది బాబు గొంతు కోసి చంపేశాడు. మృతదేహం కనిపించడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించారు. శ్రీధర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా బాబు హత్య చేసినట్టు తేలింది. బాబుకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాల తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News