- Advertisement -
మన తెలంగాణ/రాజపేట: యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లి ఆశ్రమం సమీపంలో ఆర్టిసి మినీ బస్సు అదుపు తప్పింది. యాదగిరిగుట్ట నుంచి రాజాపేటకు వెళ్తూ ఆర్టిసి మినీ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఆ కాలనీలో లుంగీలు, నైటీలతో బయట తిరగడం బ్యాన్
- Advertisement -