Monday, December 23, 2024

ఇద్దరూ సహజంగా నటించారు

- Advertisement -
- Advertisement -

Rajasekhar, Shivani Rajasekhar Stills released

 

రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘శేఖర్’. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. సోమవారం సినిమా యూనిట్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించడంతో స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో… సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాము” అని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News