Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్.. రాజశేఖరే ప్రధాన సూత్రధారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ ఘటనకు సంబంధించి కమిషన్‌కు సిట్ నివేదిక అందజేసింది. ఈ కేసులో కీలక సూత్రధారి రాజశేఖరేనని.. అతను ఉద్దేశ్యపూర్వకంగానే డిప్యూటేషన్‌పై టిఎస్‌పిఎస్‌సికి వచ్చినట్లు సిట్ నిర్ధారించింది. ఇతను టెక్నికల్ సర్వీస్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. అనంతరం ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఉన్న ప్రవీణ్‌తో రాజశేఖర్ సంబంధాలు కొనసాగించాడు. ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజశేఖర్ కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ను దొంగతనం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

అయితే పాస్ వర్డ్‌ను తాను ఎక్కడా రాయలేదని శంకర్ లక్ష్మీ చెబుతోంది. కానీ శంకర్ లక్ష్మీ చెప్పిన దానితోనే అతను కంప్యూటర్ హ్యాక్ చేసినట్లు నిర్ధారిం చారు. అనంతరం పెన్‌డ్రైవ్ ద్వారా 5 ప్రశ్నాపత్రాలను కాపీ చేసి దానిని ప్రవీణ్‌కు ఇచ్చాడు. అనంతరం ఎఇ పరీక్షా పత్రాన్ని రేణుకకు ప్రవీణ్ అమ్మాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27నే పేపర్ లీకైనట్లు సిట్ గుర్తించింది. తొలుత గ్రూప్1 పరీక్షా పత్రం లీకైనట్లు తేల్చింది. ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంతో సిట్ విచారణ జరిపింది. కమిషన్ సెక్రటరీ దగ్గర పిఎగా పనిచేస్తూ ప్రశ్నాపత్రాన్ని కొట్టేసినట్టుగా సిట్ నిర్ధారించింది.
నిందితులకు ఆరు రోజుల కస్టడీ…
మరో వైపు పేపర్ లీక్ కేసులో నిందితులకు న్యాయస్థానం ఆరు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని సిట్ అరెస్టు చేసిం ది. ఈ క్రమంలో ఆదివారం నుంచి ఈ నెల 23 వరకు నిందితులను సిట్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఇంకెన్ని పేపర్‌లు లీక్ చేశారు? ఇంకా ఎంతమంది లీక్ వ్యవహారంలో ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంది? ఇత్యాది వాటిపై సిట్ ప్రధానంగా నిందితులను ప్రశ్నించి సమా చారం రాబట్టే దిశగా ప్రయత్నిస్తోంది. పేపర్ లీక్ వ్యవహారంపై సమ గ్రంగా నిందితులను సిట్ విచారించే అవకాశం ఉంది. కాగా, ఎఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైన దగ్గర్నించీ సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది.

తొలుత కేసుకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారుల నుంచి సేకరించిన సిట్ అధికారులు ఆనక టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో అధికారులతోనూ భేటీ అయి వివరాలు రాబట్టింది. ఈ క్రమంలో పది రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని సిట్ వెల్లడించింది. దీంతో దర్యాప్తులో వేగాన్ని మరింత ముమ్మరం చేసింది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. టిఎస్‌పిఎస్‌సి లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. వివిధ రీతుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ కేసు తీవ్రతను పరిగణనలోనికి తీసుకున్న ప్రభుత్వం త్వరితగతిన కేసులో నిజానిజాల నిగ్గు తేల్చేందుకు సత్వరమే సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటైన మరుక్షణమే నుంచి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News