Thursday, November 21, 2024

అసదుద్దీన్ కు రాజాసింగ్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చాలనే ఉద్దేశంతోనే మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డు సవరణలు తెచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. టిటిడిలో,కాశీ బోర్డులో హిందూయేతరులకు స్థానం లేనప్పుడు వక్ఫ్ బోర్డులో ఇతరుల ప్రమేయం ఎందుకని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ప్రశ్నించారు.

అసదుద్దీన్ వ్యాఖ్యలపై తాజాగా బిజెపి ఎంఎల్ఏ రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. వార్తల్లో ఉండేందుకే అసదుద్ధీన్ మాట్లాడతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులే పనిచేయాలనడం కరెక్టే  అని రాజాసింగ్ స్పష్టం చేశారు. టిటిడి చైర్మన్ సరైన నిర్ణయమే తీసుకున్నారన్నారు. వక్ఫ్ బోర్డుతో టిటిడిని పోల్చడం సరికాదని రాజాసింగ్ అన్నారు. 1947లో వక్ఫ్ భూములెన్ని? హిందూ రైతుల నుంచి వారు భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వక్ఫ్ భూములపై మంచి చట్టం రాబోతుందని రాజాసింగ్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News