హైదరాబాద్: ఎంఎల్‌ఎ రాజాసింగ్‌తో మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఎ రాజేందర్ భేటీ అయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి నాయకులు, కార్పొరేటర్‌పై పోలీసులు అక్రమ కేసులు పెట్టడంతో ఈటల రాజేందర్ దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. బిజెపి కార్యకర్తలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, బిజెపి నాయకులపై నమోదైన కేసులపై పోలీస్ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం అధిష్టానం పరిధిలో ఉందని, రాజాసింగ్ సస్పెన్షన్‌ను త్వరలోనే ఎత్తివేస్తామన్నారు. వివాదాస్పద వీడియో యూట్యూబ్‌లో విడుదల చేయడంతో బిజెపి హైకమాండ్ రాజాసింగ్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. టిడిపి, బిఆర్‌ఎస్ లలో రాజాసింగ్ చేరే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాను బిజెపిలో ఉంటానని, ఆ పార్టీ తప్పితే ఇతర పార్టీలలో ఇమడలేనని రాజాసింగ్ నొక్కి చెప్పారు.
Also Read: ‘మిథునం’ రచయిత శ్రీరమణ కన్నుమూత..