Wednesday, January 22, 2025

రేవంత్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

Rajasingh warning to Revanth Reddy

హైదరాబాద్: బిజెపి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎంఎల్‌ఎ రాజాసింగ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్లాక్‌మెయిలర్‌గా పేరున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బిజెపిపై మాట్లాడే హక్కు లేదని హెచ్చరించారు. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే నైజం రేవంత్‌రెడ్డిదని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్‌పై అత్యంత హీనంగా ఆరోపణలు చేయలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీని బలిదేవత అని విమర్శించింది రేవంత్‌రెడ్డి కాదా? అని నిలదీశారు. ఇప్పుడు సోనియాకు దత్త పుత్రుడిలాగా మాట్లాడితే ఎలా నమ్మాలని రాజాసింగ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News