- Advertisement -
హైదరాబాద్: సస్పెండ్ అయిన బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ ను మంగళ్ హాట్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ… ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలు, బైక్ ర్యాలీలో పాల్గొంటా.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎనిమిదవ నిజాం పాలనా నడుస్తోందని ఆయన ఆరోపించారు. నగరంలోని హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తారు. జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
- Advertisement -