Sunday, December 22, 2024

రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేయరట!

- Advertisement -
- Advertisement -

గోషామహల్ మహల్ నుంచి ఘన విజయం సాధించిన బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటున్నారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణస్వీకారం చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారంనుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో భారతీయ జనతా లెజిస్లేచర్ పార్టీ సమావేశం గురువారం ఉదయం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 2018లో అప్పటి ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ప్రోటెం స్పీకర్ గా ఉన్నందున రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేయని విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News