- Advertisement -
ఎన్నికల ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి బిజేపి అధిష్ఠానం అభ్యర్థిని ఎంపిక చేసింది. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా బిజేపి నిర్ణయించింది. మంగళవారం శాసనసభాపక్షం సమావేశమై, భజన్ లాల్ శర్మను తమ నాయకుడిగా ఎంచుకుంది. ఆయన పేరును మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ప్రతిపాదించగా కిరోరీ మీనా, మదన్ దిలావర్, జవార్ సింగ్ బలపరిచారు. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన దియా కుమారితోపాటు ప్రేమ్ చంద్ బైర్వా ఉప ముఖ్యమంత్రులుగా మంత్రివర్గంలో కొనసాగుతారు. 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ ఎన్నో ఏళ్లుగా బీజేపీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు
- Advertisement -