Sunday, January 19, 2025

కూతురిని చంపి… మృతదేహాన్ని కదులుతున్న రైల్లో నుంచి పడేసి

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఓ మహిళ తన కూతురును చంపి అనంతరం మృతదేహాన్ని కదులుతున్న ట్రైన్‌లో నుంచి బయట పడేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం శ్రీగంగానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సునీతా అనే మహిళ తన ముగ్గురు కూతుళ్లతో కలిసి జీవనం సాగిస్తోంది. సునీతాకు సన్నీ అనే ప్రియుడు ఉన్నాడు. సునీతాకు ఐదుగురు కూతుళ్లు ఉన్నప్పటికి ఇద్దరు కూతుళ్లు భర్తతో కలిసి ఉన్నారు. తన కూతురు కిరణ్‌ను తల్లి సునీతా గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం తన ప్రియుడి సన్నీతో కలిసి మృతదేహాన్ని బెడ్ షీట్‌లో మూటకట్టారు.

మృతదేహం తీసుకొని సునీత, సన్నీ శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కొంత దూరం రైళ్లో ప్రయాణించిన తరువాత మృతదేహాన్ని కాలువ ఉన్న చోట పడేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాలువలో పడేద్దామనుకున్నారు కానీ మృతదేహం పట్టాల పక్కన పడిపోయింది. దీంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సునీతాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News