Monday, December 23, 2024

రేపే రాజస్థాన్ లో పోలింగ్….

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. కరన్‌ఫూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ సెప్సిస్ కన్నుమూయడంతో ఆ స్థానం ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాజస్థాన్ వ్యాప్తంగా 51,507 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 5.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 200 సీట్లలో 34 స్థానాలు ఎస్‌టి, 25 స్థానాలు ఎస్‌సికి కేటాయించారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్-బిజెసి మధ్య నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుత్ గాంధీ, ప్రియాంక గాంధీ, సిఎం అశోక్ గెహ్లాట్, ఇతర నేతలు ఎన్నికల సభల్లో ప్రచారం చేశారు. బిజెపి తరపున పిఎం నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్‌లు ప్రచారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News