Sunday, December 22, 2024

బ్యాట్‌తో దాడి చేసి వ్యక్తి హత్య…. పోలీస్ అధికారి కుమారుడు అరెస్టు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఓ వ్యక్తిని పోలీస్ అధికారి కుమారుడు బ్యాట్‌తో కొట్టి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రజ్నిబిహార్ కాలనీలో ప్రశాంత్ శర్మ అనే ఇన్‌స్పెక్టర్ నివసిస్తున్నాడు. ప్రశాంత్‌కు క్షితిజ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇంటికి సమీపంలో రోడ్డుపై వెళ్తున్న మోహన్ లాల్ సింధి (35) అనే వ్యక్తితో క్షితిజ్ గోడవకు దిగాడు. ఇద్దరు మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో బ్యాట్‌తో సింధి తలపై పలుమార్లు క్షితిజ్ బాదాడు. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకొని తండ్రి ప్రశాంత్ బయటకు వచ్చాడు. రక్తపు మడుగులో కనిపించిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయారని పేర్కొన్నారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News