Thursday, January 23, 2025

రాజస్థాన్ ఎన్నికల తేదీ మార్పు… ఈసీ కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పు చేసింది. నవంబర్ 23న జరగాల్సిన పోలింగ్ తేదీని నవంబర్ 25కి మారుస్తూ బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 23 (గురువారం ) జరగాల్సి ఉంది. ఇదే రోజు అక్కడ దేవ్ ఉథాని ఏకాదశి … దాంతో ఆ రాష్ట్రంలో 50 వేల కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. దాంతో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్‌శాతం తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రాజస్థానీలు దేవ్ ఉధాని ఏకాదశి రోజున వివాహాలు నిర్వహించుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యం లోనే పోలింగ్ తేదీని మార్చాలంటూ పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి ఈసీకి విజ్ఞప్తులు వచ్చాయి. అలాగే , రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతోపాటు ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉండొచ్చని, అందువల్ల పోలింగ్ తేదీ మార్చాలంటూ మీడియాసంస్థల వేదికగా వచ్చిన విజ్ఞప్తులను పరిగణన లోకి తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 25 కి మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News