Sunday, December 22, 2024

రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. బికానేర్ జిల్లాలోని మహాజన్ జైత్పూర్ టోల్ గేట్ సమీపంలో కారు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు హర్యానాలోని హనుమాన్ ఘఢ్ ప్రాంతం దబవాలి ప్రాంతతానికి చెందిన వారి అని పోలీసులు వెల్లడించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన ఆర్తి, దుబ్బు, భూమిక, నీరజ్ కుమార్, శివ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ కు అంతరాయ లేకుండా క్రేన్ సహాయంతో కారు పక్కకు తొలగించారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News