15 మంత్రుల పదవీ ప్రమాణం
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది: గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న రాజ్‌భవన్‌లో ఆదివారం మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగింది. మొత్తం 15 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 12 మంది కొత్త మంత్రులు కాగా, ముగ్గురు సహాయ మంత్రుల నుంచి క్యాబినెట్ ర్యాంకుకు పదోన్నతి పొందినవారున్నారు. కొత్త మంత్రుల పదవీస్వీకరణోత్సవానికి ముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జీ అజయ్ మాకెన్ ఎంఎల్‌ఏలను, ఇతర పార్టీ నాయకులను ఉద్దేశించి జైపూర్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రసంగించారు. తర్వాత ట్విట్టర్‌లో గెహ్లాట్ తాము రాబోయె అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టామని, 2023లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏరాటుచేస్తుందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల తర్వాత క్యాబినెట్ మార్పు(రీజిగ్) చేపట్టింది. ఇదివరకు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలదొక్కుకుంది. కాగా సచిన్ పైలట్‌కు నమ్మకస్థులయిన రమేశ్ మీనా, విశ్వేంద్ర సింగ్ ఇప్పుడు తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు. ఇక బ్రిజేంద్ర సింగ్ ఓలా, హేమారం చౌదరి, మురళీలాల్ మీనా కొత్తగా ప్రవేశించారు. శాంతి సూత్రంలో భాగంగా సచిన్ పైలట్‌కు నమకస్థులైన వారికి తిరిగి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. మరో రెండు సంవత్సరాలలో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పునర్వవస్థీకరణ జరిగింది. అంతేకాక ఈ మంత్రివర్గం మార్పు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి ఓ సందేశాన్ని కూడా పంపినట్లయింది.