Saturday, December 21, 2024

ప్రపంచ కాలుష్య నగరాల్లో రాజస్థాన్‌కు చెందిన భివాడి టాప్ !

- Advertisement -
- Advertisement -

Polluted Cities
న్యూఢిల్లీ: స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ రూపొందించిన ‘ప్రపంచ వాయు నాణ్యత’ నివేదిక ప్రకారం 2021లో వరుసగా నాల్గవ సంవత్సరం కూడా న్యూఢిల్లీ ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా కొనసాగుతోంది. వాయు నాణ్యత అధ్వాన్నంగా ఉన్న 50 నగరాల్లో 35 భారత్‌లోనే ఉన్నాయని ఆ సంస్థ మంగళవారం విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఉన్న ఢిల్లీ వాయు కాలుష్యం గత ఏడాది కంటే దాదాపు 15 శాతం పెరిగింది. అయితే ప్రపంచంలో అత్యంత కాలుష్య ప్రదేశం రాజస్థాన్‌లోని భివాడి, ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ ఉన్నాయి. దేశంలో దాదాపు 15 అత్యంత కాలుష్య నగరాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు దేశ రాజధాని చుట్టూ ఉన్నాయని అధ్యయనంలో వెల్లడయింది.
ఐక్యూఎయిర్ అనే స్విస్ కాలుష్య సాంకేతిక కంపెనీ సంకలనం చేసిన డేటా ప్రకారం దాదాపు 93 నగరాలు పిఎం 2.5 స్థాయిని తాకాయి. ఇది సిఫార్సు చేసిన స్థాయికన్నా పదిరెట్లు ఎక్కువ. బంగ్లాదేశ్ అత్యంత కలుషిత దేశంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఎలాంటి మార్పు లేదు. కాగా ఆఫ్రికా దేశం డేటాను మొదటిసారిగా చేర్చిన తర్వాత చాద్ రెండో స్థానంలో ఉంది. జిన్‌జియాంగ్‌లోని వాయువ్య ప్రాంతమైన హోటాన్ చైనాలో అత్యంత అధ్వాన నగరంగా నిలిచింది. అక్కడ సగటు పిఎం 2.5 రీడింగ్‌లు 100 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నాయి. అవి చాలావరకు ఇసుక తుఫానుల మూలంగా ఏర్పడుతోంది. కాగా ఆ ప్రదేశం అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News