- Advertisement -
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ జైపూర్‌లోని సవాయీమాన్‌సింగ్ హాస్పిటల్ నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం గెహ్లాట్‌కు యాంజియోప్లాస్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన గుండె కవాటాల్లో ఒకటి మూసుకుపోవడంతో స్టెంట్ అమర్చారు. 70 ఏళ్ల గెహ్లాట్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనాబారిన పడ్డారు. మే నెలలో కోలుకున్న గెహ్లాట్ కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్నారు. అధికారిక నివాసానికి చేరుకున్న గెహ్లాట్ మరికొన్ని రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని అధికారులు తెలిపారు.
- Advertisement -