జైపూర్: అనారోగ్యంతో బాధపడుతున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌కు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ వైద్య కళాశాల ఆస్పత్రిలో శుక్రవారం ఆయన గుండెలో స్టెంట్ అమర్చారు. 70 ఏళ్ల గెహ్లాట్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనాబారిన పడ్డారు. కోలుకున్నాక ఆయనకు పోస్ట్ కొవిడ్ సమస్యలు మొదలయ్యాయి. గుండెలో బరువుగా ఉన్న ఫీలింగ్, మెడలో నొప్పితో ఆయన బాధపడ్డారు. ఆయన గుండె కవాటాల్లో ఒకటి 90 శాతం మూసుకుపోయిందని, దాంతో స్టెంట్ అమర్చామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా॥సుధీర్‌భండారీ తెలిపారు. ప్రస్తుతం గెహ్లాట్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని భండారీ తెలిపారు. గెహ్లాట్‌కు రెండు,మూడు రోజులపాటు పూర్తి విశ్రాంతి అవసరమని ఆయన తెలిపారు. యాంజియోప్లాస్టీకి ముందు శుక్రవారం ఉదయం గెహ్లాట్ తన సమస్యపై ట్విట్ చేశారు. గెహ్లాట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్ చేశారు.
రాజస్థాన్ సిఎం గెహ్లాట్‌కు యాంజియోప్లాస్టీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -