Monday, December 23, 2024

రాజస్థాన్‌లో కాంగ్రెస్ సమైక్యత పై స్పష్టం చేసిన రాహుల్

- Advertisement -
- Advertisement -

జైపూర్ : వచ్చేనెల జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యతతో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ధారించారు. రాజస్థాన్ కాంగ్రెస్ విభాగంలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఆయన తాము కలిసే ఉన్నట్టు కనిపించడం కాదని, కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని ఆయన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ , తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సమక్షంలో స్పష్టం చేశారు. చురులో తారానగర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లే ముందు రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గెహ్లాట్‌కు, పైలట్‌కు మధ్య సయోధ్య కుదిరినట్టు ఈ వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది. 2020లో డిప్యూటీ సిఎంగా ఉన్న పైలట్ ,

ఆయన వర్గం 18 మంది ఎమ్‌ఎల్‌ఎలు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. తరువాత పైలట్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా కోల్పోయారు. అప్పటి సంక్షోభం నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య సంబంధాలు అంతగా కొనసాగలేదు. ఈ ఏడాది మొదట్లో పైలట్ మళ్లీ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు సాగించారు. అదివరకటి బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇటీవల ఇండియాటుడే టివీ ఇంటర్వూలో గెహ్లాట్‌తో సంబంధాలపై మాట్లాడుతూ గతంలో ఏం జరిగిందో ఇప్పుడు తాను ఫోకస్ చేయదల్చుకోలేదని పేర్కొన్నారు. పార్టీ కోసం కలిసి పనిచేయడం తమ బాధ్యతగా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News