జైపూర్: రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో సమరావత పోలింగ్ స్టేషన్ లో మాల్ పురా సబ్-డివిజినల్ మెజిస్ట్రేట్ (ఎస్ డిఎం) అమిత్ చౌదరి చెంపపగులగొట్టిని వీడియో వైరల్ అవుతోంది. ఆ చెంప పగులగొట్టింది స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనా. ఆయన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి. ఆయన మద్దతుదారులు రాత్రి పోలీసులతో గొడవ పడ్డారు. ఆ స్వతంత్ర అభ్యర్థి డియోలీ-యునియార అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఆయన బుధవారం ఎస్ డిఎం చెంప పగులగొట్టాడు. ఆ వీడియో వైరల్ అయింది. ‘‘ ఎఫ్ డిఎం నకిలీ ఓటర్లను ఓటేయడానికి అనుమతించారు’’ అన్నది ఆయన వాదన. ఆ తర్వాత పోలీసులకు మీనా మద్దతుదారులకు మధ్య బుధవారం రాత్రి 10 గంటలకు గొడవ జరిగింది. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. 60కి పైగా వాహనాలు దగ్ధం చేశారని అధికారులు తెలిపారు. పోలీసులు బాష్పవాయు ప్రయోగం కూడా చేశారు.
జిల్లా కలెక్టర్ సౌమ్య ఝా ఈ ఘటనపై రిపోర్టు దాఖలు చేయమని సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ చౌదరి ని ఆదేశించారు. దాంతో ఎఫ్ఐఆర్ నమోదయింది. అరెస్టుకు ముందు ఎస్ డిఎంపై తాను దాడి చేశానన్నది అబద్ధం అని మీనా అన్నారు. నకిలీ ఓటర్లను అనుమతించినందుకే ఆయనపై తన ఆగ్రహం అన్నారు.
https://x.com/i/status/1856678040694104244