Thursday, January 23, 2025

రాజస్థాన్‌లో దారుణం..

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దౌసా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌సోట్ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలికను ఎస్‌ఐ భూపేందర్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం తన రూమ్‌కు తీసుకు వచ్చాడు. అక్కడే ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎఎస్‌పి రామచంద్ర సింగ్ చెప్పారు. ఈ ఘటన అనంతరం స్థానికులు పెద్ద సంఖ్యలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహువాస్ పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు.

నిందితుడైన ఎస్‌ని జనం చితకబాదారు కూడా. దళిత బాలికను ఒక పోలీసు రేప్ చేసిన ఘటనపై జనంలో పెద్ద ఎత్తున ఆగ్రహం ఉందని ఘటనా స్థలానికి చేరుకున్న బిజెపి ఎంపి కిరోడి లాల్ మీనా అన్నారు. అసమర్థ అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం కారణంగా పోలీసులు నియంతల్లాగా మారిపోయారని, ఎన్నికలు లాంటి సున్నితమైన సందర్భాల్లో సైతం అత్యాచారాలు చేయడానికి వెనకాడ్డం లేదని ఆయన అన్నారు. నిందితుడు భూపేందర్ సింగ్‌పై తీవ్ర చర్య తప్పదని, ఆయనను త్వరలోనే ఉద్యోగంనుంచి తొలగించడం జరుగుతుందని ఆయన అన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News