Friday, December 20, 2024

హీట్‌వేవ్‌పై జాతీయ ఎమర్జన్సీ ప్రకటించండి:రాజస్థాన్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

దేశంలో ప్రస్తుతం సాగుతున్న హీట్‌వేవ్ దృష్టా జాతీయ ఎమర్జన్సీ ప్రకటించవలసిందని కేంద్రానికి రాజస్థాన్ హైకోర్టు విజ్ఞప్తి చేసింది. వారాలుగా సాగుతున్న మండు వేసవిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని హైకోర్టు తెలిపింది. భారత్ దుర్భరమైన హీట్‌వేవ్‌ను చవి చూస్తున్నది. పలు నగరాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. మండే ఎండల నుంచి ప్రజల రక్షణకు అధికారులు సముచిత చర్యలు తీసుకోలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. ‘హీట్‌వేవ్ రూపంలో దుర్భర వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నెలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు’ అని కోర్టు తెలిపింది.

‘మనం తరలిపోవడానికి మరొక గ్రహం లేదు& మనం ఇప్పుడు కఠిన చర్య తీసుకోకపోతే మన భావి తరాల వృద్ధిని చూసే అవకాశాన్ని కోల్పోతాం’ అని కోర్టు పేర్కొన్నది. ప్రస్తుత హీట్‌వేవ్, భవిష్యత్తులో తలెత్తే అటువంటి పరిస్థితుల గురించి హైకోర్టు అప్రమత్తం చేస్తూ, వాటిని ‘జాతీయ విపత్తులు’గా భారత్ ప్రకటించడం ప్రారంభించాలని సూచించింది. వరదలు, తుపానులు, ప్రకృతి వైపరీత్యాలలో వలె అత్యవసర సహాయం సమీకరణకు ఇది వీలు కల్పిస్తుందని కోర్టు పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News