- Advertisement -
రాజస్థాన్ లో శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా శనివారం 199 స్థానాలకు జరుగుతోన్న పోలింగ్ నిర్వహిస్తున్నారు. కరణ్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మిత్ సింగ్ కున్నూర్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. 199 స్థానాల బరిలో 1,862 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్ లో చురుగ్గా పోలింగ్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -