Monday, December 23, 2024

రాజస్థాన్ మహిళా జడ్జీనే బ్లాక్‌మెయిల్ చేసిన ఘనుడు!

- Advertisement -
- Advertisement -

జైపూర్: మార్ఫింగ్ ఫోటోలతో రూ. 20 లక్షలు ఇవ్వాలని, లేకుంటే వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెడతానని ఓ ప్రబుద్ధుడు రాజస్థాన్ మహిళా జడ్జీనే బ్లాక్‌మెయిల్ చేశాడని పోలీసులు తెలిపారు. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన అతడిని గుర్తించారు. కాగా అతడి కోసం వెతుకుతున్నారు. అతడు జడ్జీ ఫోటోలను ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని ఎడిట్ చేసి కోర్టులోని ఆమె ఛాంబర్‌కు పంపాడు. అంతేకాక ఆమె ఇంటికి కూడా పంపాడని పోలీసులు తెలిపారు.

దీనికి సంబంధించిన కేసును ఫిబ్రవరి 28న నమోదుచేశారు. ఇప్పటి వరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆ జడ్జీ ఫిబ్రవరి 7న ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. తన స్టెనోగ్రాఫ్ ఓ డెలివరీ పార్సెల్‌ను తెచ్చి ఇచ్చిందని పేర్కొంది. పైగా అది తన చిన్నప్పటి స్కూల్ నుంచి వచ్చిందని తెలిపింది. కాగా స్టెనోగ్రాఫర్ ఆ పార్సల్ ఇచ్చినతడిని పేరు అడుగగా అతడు వెళ్లిపోయాడని జడ్జీ పేర్కొంది.

ఆ పార్సల్‌లో కొన్ని మిఠాయిలు, మార్ఫింగ్ చేసిన మహిళా జడ్జీ ఫోటోలు ఉన్నాయి. ఓ ఉత్తరం కూడా దాంట్లో ఉండింది. ఒకవేళ ఆమె రూ. 20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫోటోలను బహిర్గతం చేస్తానని కూడా బెదిరించినట్లు ఆమె తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ‘రూ. 20 లక్షలతో సిద్ధంగా ఉండు. లేకుంటే నీ కుటుంబం పరువు పోతుంది. త్వరలో ఎప్పుడు, ఎక్కడ ఇవ్వాలో తెలుపుతాను’ అని ఆ లెటర్‌లో బ్లాక్‌మెయిలర్ రాశాడు.

20 రోజుల తర్వాత అలాంటి పార్సలే మరొకటి ఆమె ఇంటికి చేరింది. అది కూడా ఆమె ఎఫ్‌ఐఆర్ నమోదుచేశాక అని పోలీసులు తెలిపారు. 20 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువకుడు ఆ పార్సల్‌ను కోర్టులోని ఆమె ఛాంబర్‌కు డెలివరీ చేయడం సిసిటివి కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News