- Advertisement -
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. నిన్న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టుకు ఐపిఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందుకు కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టులోని ప్రతి ఆటగాడు రూ.6 లక్షల చొప్పున ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కట్టాలని ఆదేశించింది.
కాగా, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ 19.2 ఓవర్లలో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో గుజరాత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
- Advertisement -