Monday, December 23, 2024

రాజస్థాన్‌లో కొత్తగా మరో 17 జిల్లాలు

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లో కొత్తగా మరో 17 జిల్లాలు పాలన లోకి వచ్చాయి. సోమవారం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈమేరకు ఆయా జిల్లాల ఫలకాలను వర్చువల్‌గా ఆవిష్కరించి యజ్ఞంలో పాల్గొన్నారు. జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రుల సమక్షంలో జిల్లా కేంద్రాల్లో ప్రార్థనలు, యజ్ఞాలు నిర్వహించారు. బిర్లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాల వెబ్‌సైట్లను కూడా ప్రారంభించారు. ఈనెల 4 న కేబినెట్ ఆమోదించిన తరువాత 17 కొత్త జిల్లాల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ కొత్త 17 జిల్లాలతో కలిపి రాజస్థాన్‌లో మొత్తం జిల్లాల సంఖ్య 50కు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News