Monday, December 23, 2024

ప్రియురాలిని చంపి…. బైక్ పైనుంచి కిందపడి చనిపోయిందని నమ్మించాడు…

- Advertisement -
- Advertisement -

జైపూర్: ప్రియురాలిని ప్రియుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేయడంతో మృతి చెందింది. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని ప్రియుడు నమ్మించిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నజ్లు ఖాన్ అనే వ్యక్తి రుక్సానాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రుక్సానాకు నలుగురు పిల్లలు ఉన్నారు. రుక్సానా మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందని ఆమెపై నజ్లు ఖాన్‌కు అనుమానం ఉండేది. ఆమెను మాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోక్సు జాతీయ రహదారి సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఆమెను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

Also Read: కూతురిని తల్లి గొడ్డలితో నరికి… బావిలో పడేసింది

రుక్సానా చనిపోయిందనుకొని నిర్ధారించుకొని వెంటను ఆమెను ప్రతాప్‌నగర్‌లో ఓ ఆస్పత్రికి తరలించారు. రుక్సానాను బైక్‌పై తీసుకెళ్తుంటే కిందపడిందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆమె తన బైక్‌పై కూర్చున్నప్పుడు వీడియో తీసి తన ఫోన్‌లో పెట్టుకున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను జైపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రుక్సానా చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించడంతో వెంటనే అక్కడి నుంచి నజ్లు ఖాన్ పారిపోయాడు. రోడ్డు ప్రమాదంపై అనుమానాలు ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌లోని సిమ్ కార్డు మార్చేశాడు. ఆ ఫోన్‌లో మరో సిమ్ వేయడంతో పోలీసులు లోకేషన్ ట్రాక్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియురాలు మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అనుమానం వచ్చి దాడి చేశానని, ఆమె చనిపోయిందని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News