Friday, December 20, 2024

హోటల్ రూమ్‌లో బిఎస్‌ఎఫ్ జవాన్ మృతదేహం…

- Advertisement -
- Advertisement -

జైపూర్: హోటల్ రూమ్‌లో బిఎస్‌ఎఫ్ జవాన్ మృతదేహం కనిపించిన సంఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెందిన జవాన్ రాజస్థాన్‌లో బిఎస్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్ నుంచి తన సొంతూరు వెళ్లడానికి జైసల్మేర్ రైల్వే సేష్టన్‌కు వచ్చాడు. రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకున్నాడు. రూమ్ నుంచి అలికిడి లేకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని రూమ్‌డోర్‌ను బలవంతంగా తీశారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News