- Advertisement -
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో తొమ్మిది మంది మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆస్పత్రికి వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్ చెందిన పది మంది మధ్యప్రదేశ్‌లోని ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు డైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతులు రాజస్థాన్‌లోని దుంగావర్‌గావ్‌కు చెందిన వారిగా గుర్తించారు.
- Advertisement -