Monday, December 23, 2024

క్యాంపస్‌లో బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి… బాలికపై గ్యాంగ్‌రేప్

- Advertisement -
- Advertisement -

జైపూర్: జెఎన్‌వియు క్యాంపస్‌లో బాయ్ ఫ్రెండ్‌ను కొట్టి దళిత బాలికపై ముగ్గురు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 17 ఏళ్ల బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అజ్మీర్ నుంచి జోధ్‌పూర్‌కు పారిపోయింది. ఆదివారం రాత్రి 10.30 గంటలకు జోద్‌పూర్‌కు చేరుకున్నారు. వారు అక్కడి నుంచి గెస్ట్‌హౌజ్‌కు చేరుకున్నారు. గెస్ట్‌హౌజ్‌లో కేర్‌టేకర్ సురేష్‌జాట్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ నుంచి బాయ్‌ఫ్రెండ్, బాలిక పరోటా చౌరహా చేరుకున్నాడు. అక్కడ సమందర్ సింగ్ భాటి, ధర్మపాల్ సింగ్, భట్టమ్ సింగ్‌ను వారు కలిశారు. ముగ్గురు కలిసి వారికి కూల్ డ్రింక్స్, ఫుడ్ ఇచ్చారు.

Also Read: పాతబస్తీలో ఐదు స్టేషన్లు

వారితో ముగ్గురు స్నేహంగా ఉండడంతో వారిని జంట నమ్మింది. రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తామని చెప్పి మార్నింగ్ నాలుగు గంటల ప్రాంతంలో ఆ జంటను జై నారాయణ వైశ్యా యూనివర్సిటీలోని హాకీ గ్రౌండ్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది అనంతరం ఆ బాలికపై ముగ్గురు కలిసి అత్యాచారం చేశారు. మార్నింగ్ వాకర్స్‌కు బాయ్‌ఫ్రెండ్ చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని బాలిక, బాయ్‌ఫ్రెండ్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను గణేష్‌పూరాలోని రతనాదాలో అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా వారు పారిపోతుండగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు అధికారి దుహాన్ తెలిపారు. జెన్‌వియులో సమందర్ బిటెక్ ఫస్ట్‌ఇయర్, ధర్మపాల్ సింగ్ అనే విద్యార్థి పిజి చదువుతున్నారు. భట్టమ్ సింగ్ వ్యక్తి బిఇడి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. గెస్ట్‌హౌజ్ కేర్ టేకర్ బాలిక అసభ్యంతో ప్రవర్తించడంతో అతడిని కూడా అరెస్టు చేశారు. దళిత బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ డిజిపి ఉమేష్ మిశ్రాకే ఆదేశించాడు. నిందితులలో ఎబివిపితో సంబంధాలు ఉన్నాయని గెహ్లాట్ ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News