Saturday, December 21, 2024

కారులో దంపతులను తుపాకీతో కాల్చి చంపారు…

- Advertisement -
- Advertisement -

జైపూర్: కారులో దంపతులను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కరౌలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో వికాస్, దీక్షా అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు కిరావాళి దేవాలయానికి వెళ్తుండగా రాజస్థాన్ లోని మస్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోజ్‌పూర్‌కు కిలో మీటరు దూరంలో కారులో వారి మృతదేహాలు కనిపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌పి బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. భార్య తలలో ఒక బుల్లెట్ ఉండగా భర్త కూడా బుల్లెట్ గాయాలతోనే మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులను ఎవరు కాల్చి చంపారు, ఎందుకు చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News