జైపూర్: జల్సాలకు అలవాటు పడిన మనవడు ఆస్తి పంచి ఇవ్వడంలేదని తాత నానమ్మను చంపిన సంఘటన రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బరాన్ ప్రాంతంలోని మండోలా గ్రామంలో రామ్‌కల్యాణ్(85), లతూరిబాయ్(80) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు మనవడు దేవేంద్ర రాథోడ్ జల్సాలకు అలవాటు పడడంతో అతడి దగ్గర డబ్బులు లేకపోవడంతో తన తాత, నానమ్మలను ఆస్తి పంచి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పటికే దేవేంద్ర తండ్రి చనిపోవడంతో తల్లి దగ్గరే పెరుగుతున్నాడు. తన తాత, నానమ్మ దగ్గరకు వచ్చి ఆస్తి పంచి ఇవ్వాలని అడిగాడు. వాళ్లు ఇవ్వకపోవడంతో రాత్రి పడుకున్న తరువాత వారిని చంపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు విచారణ ప్రారంభించారు. ఏమీ తెలియనట్టు తాతయ్య, నానమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్ని అన్ని కార్యక్రమాలు మనవడు నిర్వహించాడు. విచారణలో భాగంగా మనవడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: మహిళా బిల్లు దానికి ముడిపెట్టొద్దు: కవిత