Thursday, January 23, 2025

కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లలో కారం కొట్టి… నిందితులపై కాల్పులు… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్: నిందితులను న్యాయస్థానం తీసుకెళ్తుండగా వారిపై దుండగులు కాల్పులు జరపడంతో ఖైదీలలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన రాజస్థాన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2022లో బిజెపి నేత కృపాల్ జఘీనాను కుల్దీప్ జఘీనా, విజయపాల్ అనే వ్యక్తులు హత్య చేశారు. వీరిని భరత్‌పూర్ కోర్టులో హాజరుపరిచేందుకు ఓ బస్సులో ఆరుగురు పోలీసులు తీసుకెళ్తున్నారు. అమోలీ టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే బైక్‌లు, కార్లపై వచ్చి బస్సు అడ్డుకున్నారు. బస్సులోనికి ప్రవేశించి పోలీసుల కళ్లలో కారం చల్లి ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపారు. పోలీసులు అప్రమత్తమై నలుగురిని అక్కడే పట్టుకున్నారు. కుల్దీప్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన విజయపాల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

https://www.instagram.com/patialapolitics/?utm_source=ig_embed&ig_rid=bfa5ada5-3aba-40e4-9f20-f10ed23b3353

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News