Sunday, December 22, 2024

భార్యను బైక్ కు కట్టి… వీధుల్లోకి ఈడ్చుకెళ్లిన శాడిస్ట్ భర్త

- Advertisement -
- Advertisement -

జైపూర్: సోదరి ఇంటికి వెళ్తానని చెప్పడంతో భార్యను భర్త చితక బాదాడు అనంతరం ఆమెను బైక్‌కు కట్టి గ్రామంలో ఈడ్చుకెళ్లాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నహరసింగ్‌పుర గ్రామంలో మేఘ్‌వాల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. భర్త మద్యానికి బానిసగా మారి భార్యను వేధించేవాడు. జైసల్మేర్‌లో ఉటున్న తన సోదరి ఇంటికి వెళ్తానని భర్తకు భార్య చెప్పడంతో అతడు నిరాకరించాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో భార్యను చితకబాది అనంతరం ఆమె కాళ్లకు తాడు కట్టాడు. ఆ తాడును బైక్‌కు కట్టి గ్రామంలోకి ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం భార్య బంధువుల ఇంట్లో ఉన్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News