Tuesday, November 5, 2024

రాజస్థాన్ అసెంబ్లీలో త్వరలో వ్యవస్థీకృత నేర నియంత్రణ బిల్లు!

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లో పెరుగుతున్న నేరాలు, గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాల నేపథ్యంలో ఆ రాష్ట్రం వ్యవస్థీకృత నేరాలకు(ఆర్గనైజ్డ్ క్రైమ్స్) వ్యతిరేకంగా ఓ బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం తేబోతోంది. అది మహారాష్ట్ర, యూపి, ఢిల్లీ, కర్నాటకలో ఉన్న మాదిరి ఉండగలదు. రాజస్థాన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్(ఆర్‌ఓసిసి)బిల్లు ముసాయిదాను మంత్రివర్గం(క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్) బుధవారం ఆమోదించింది. ఈ బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

మంత్రివర్గ సమావేశానంతరం ప్రభుత్వం ఓ ప్రకటన జారీచేసింది. నేరాల రీతి మారిందని, నేరస్థులు ఇప్పుడు గ్యాంగులుగా ఏర్పడ్డారని, వారితో ఎలా డీల్‌చేయాలో చెప్పే ప్రత్యేక చట్టం లేదక్కడ. ప్రతిపాదిత బిల్లు ప్రకారం పదేళ్లలో ఎవరి మీదైతే ఒక్కటి కన్నా ఎక్కువ అబియోగాలు మోపబడి ఉంటే దాన్ని నేరంగా(కాగ్నిజెన్స్) కోర్టు భావిస్తుంది. ఓ వ్యవస్థీకృత నేర ముఠాలో సభ్యుడైన నేరస్థుడు నేరం చేస్తే అది మూడేళ్ల శిక్షార్హం అవుతుంది లేక ఆర్‌ఓసిసి పరిధిలోకి వస్తుంది.

నేర ఘటనలో ఎవరైనా బాధితుడు మరణించితే అది క్యాపిటల్ పనిష్మెంట్ కిందికి లేక జీవిత ఖైదు, కనీసం రూ. 1 లక్ష జరిమాన కిందికి వస్తుంది. నేరస్థుల ముఠాకు ఆశ్రయం ఇచ్చినా అది నేరపూరిత కుట్ర కిందికి వస్తుంది. అది కనీసం ఐదేళ్ల కారాగార శిక్షకు దారితీస్తుంది. దానిని జీవిత ఖైదు కిందికి విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. మంత్రివర్గం ఇంకా రాష్ట్ర అటవీ విధానంకు సంబంధించిన మూడు పాలసీలకు కూడా ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News