Monday, December 23, 2024

ప్రియురాలి భర్తను ఆరు ముక్కలుగా నరికి… సమాధిపై మామిడి మొక్కను నాటాడు…

- Advertisement -
- Advertisement -

జైపూర్: ప్రియురాలి భర్తను చంపి ఆరు ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాలలో పడేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం పాలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జోగేంద్ర మేగావాల్ అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నాడు. జోగేంద్ర భార్యతో మదన్‌లాల్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని చంపేయాలని మదన్‌లాల్ నిర్ణయం తీసుకున్నాడు. జోగేంద్రని చంపి మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి అనంతరం శరీర భాగాలను ఇంటికి సమీపంలో వివిధ ప్రదేశాలలో పడేశారు. గుంత తవ్వి తల, చేతులను పాతిపెట్టాడు అనంతరం సమాధిపై మామిడి మొక్కలను నాటాడు. జులై 11 నుంచి తన కుమారుడు కనిపించడం లేదని జోగేంద్ర తండ్రి మిశ్రలాల్ మెగావాల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మదన్‌లాల్‌పై అనుమానం ఉందని, ఈ హత్యలో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని పోలీసులను కోరాడు. వెంటనే పోలీసులు మదన్ లాల్ ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మృత్యుంజయుడు ఆ జెసిబి డ్రైవర్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News