Monday, December 23, 2024

ఐ లవ్ యు చెప్పి అరెస్టైన పంతులు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఐ లవ్ యు చెప్పడంతో అతడిని అరెస్టు చేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవీన్ జోషి(51) అనే ఉపాధ్యాయుడు గవర్నమెంట్ సెకండరీ స్కూల్‌లో పని చేస్తున్నాడు. పలుమార్లు బాలికలను గిల్లడంతో పాటు అసభ్యం ప్రవర్తించేవాడు. ఎనిమిదో తరగతి బాలికను గిల్లడంతో పాటు ఐ లవ్ యు చెప్పడంతో ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే పిల్లల తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకొని ధర్నాకు దిగారు. సదరు స్కూల్ టీచర్ సస్పెండ్ చేయడంతో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read: సర్వర్‌లో సమస్య.. ఆగిన పిజిటి పరీక్ష

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News