Monday, December 23, 2024

రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ పోలీసుల దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ముస్లింలు, క్రైస్తవులపై యోగా గురు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ పోలీసులు శనివారం సుమోటోగా దర్యాప్తు ప్రారంభించారు. నమాజ్ పేరుతో ముస్లింలు తీవ్రవాదులను సృష్టిస్తున్నారని, మత మార్పిడులను నిర్వహించడంలో క్రైస్తవులు నిమగ్నమై ఉన్నారంటూ రాందేవ్ బాబా వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను ఇస్లాంకు కాని, క్రైస్తవానికి కాని వ్యతిరేకం కాదని, మతాల పేరుతో ఆయా మతస్తులు చేస్తున్న కార్యకలాపాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News