Monday, December 23, 2024

రాజస్థాన్‌కు రెండో గెలుపు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 12 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు సాధించింది. రియాన్ పరాగ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రియాన్ పరాగ్ 45 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అశ్విన్ 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. చివర్లో ధ్రువ్ జురెల్ (20), హెట్‌మెయిర్ 14 (నాటౌట్) ధాటిగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 185 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ (49), ట్రిస్టన్ స్టబ్స్ 44 (నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News